శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 12 మే 2019 (16:39 IST)

సహజీవనం చేసింది.. కానీ మనస్పర్థలు.. కొబ్బరిబొండాలు నరికే కత్తితో?

ఇష్టపడి సహజీవనం చేశారు. కొన్నాళ్లు వీరి వ్యవహారం అంతా సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. దీంతో కోపం తట్టుకోలేని మహిళ... కొబ్బరిబొండాలు నరికే కత్తితో సహజీవనం చేస్తున్న వ్యక్తిపై దాడికి దిగింది. విచక్షణా రహితంగా కత్తితో నరికి పరారయ్యింది. కృష్ణా జిల్లాలో తిరువూరులో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
 
వివరాల్లోకి వెళితే.. తిరువూరు బైపాస్‌ రోడ్డులో టీస్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు వీరంకి శ్రీనివాసరావు. గత కొన్నేళ్లుగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన మణి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య గొడవులు దాడికి కారణమయ్యాయి. దీంతో ఆగ్రహించిన మణి కొబ్బరి బోండాలు నరికే కత్తితో మణిని నరికింది. ఆపై అక్కడ నుంచి పారిపోయింది.  
 
ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు పోలీసులు.. ఇంట్లో అపస్మారక స్థితిలో పడివున్న శ్రీనివాసరావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు మణి కోసం గాలింపు చేపట్టారు.