1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: గురువారం, 16 జూన్ 2016 (13:21 IST)

1 కిలో టమోటా ధర రూ. 80.... బెంబేలెత్తిపోతున్న ప్రజలు

విజ‌య‌వాడ: కూర‌గాయ‌ల మార్కెట్లోకి వెళితే, టమోటా, ఉల్లిపాయ‌లు... ఈ రెండూ కొన‌నిదే మ‌నం బ‌య‌ట‌కు రాలేము. ఎందులో అయినా ఇవి అవ‌స‌రం. కానీ, ఇపుడు ఆ ట‌మోటా ధ‌ర చూస్తే, గుండెలు ఠారెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కేజీ టమోటా రూ. 80కి అమ్మకం చేస్తుండటంతో ప్ర

విజ‌య‌వాడ: కూర‌గాయ‌ల మార్కెట్లోకి వెళితే, టమోటా, ఉల్లిపాయ‌లు... ఈ రెండూ కొన‌నిదే మ‌నం బ‌య‌ట‌కు రాలేము. ఎందులో అయినా ఇవి అవ‌స‌రం. కానీ, ఇపుడు ఆ ట‌మోటా ధ‌ర చూస్తే, గుండెలు ఠారెత్తుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా కేజీ టమోటా రూ. 80కి అమ్మకం చేస్తుండటంతో ప్రజలు దీన్ని కొనుగోలు చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఇంట్లో కూరలు వండాలంటే ఉల్లిపాయలతో పాటు టమోటా కచ్చితంగా వాడాల్సిన అవసరం ఉంది. మార్కెట్లో ధర అమాంతం పెరిగిపోవడంతో ప్రత్యామ్నాయ వంటకాలు చేయడంపైనే దృష్టి సారించాల్సి వస్తోంది. కూరలో ఉల్లిపాయలతో పాటుగా టమాటాకు బదులు చింతపండు రసంతో వంటకం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
 
టమోటా కేజీ రూ.4కి అమ్మిన రోజులున్నాయి. కానీ ఇపుడు చూస్తే దాని ధ‌ర 80 రూపాయ‌ల‌కు చేరిపోయింది. కొన్నిచోట్ల కిలో టమోటా వంద రూపాయ‌లు కూడా అమ్ముతున్నారు. ఇలా ఎన్నడూ అమ్మకం చేయలేదని హోల్‌సేల్‌ వ్యాపారులు చెపుతున్నారు. గత అక్టోబరు, నవంబరు నెలలో కేజీ రూ. 60 నుంచి రూ. 70కి అమ్మకం జరిగిందని, కొద్దిరోజుల్లోనే ధర తగ్గిపోయిందని తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో ఇలా ధర పెరగడం అందరినీ విస్మయానికి గురిచేసింది.
 
మ‌ద‌న‌ప‌ల్లి నుంచి హోల్‌సేల్ టమోటా!
చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి హోల్‌సేల్‌ టమోటా దుకాణాలకు దిగుమతి జరుగుతుంది. మదనపల్లి చుట్టు పక్కల ప్రాంతాలు పలమనేరు, పుంగనూరు, ఉర్రంకొండల్లో టమోటా పంట ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ఏడాది పంట ఆశించిన స్థాయిలో లేకపోవంతో ధర ఆకాశాన్ని అంటింది.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ఇక్కడి నుంచి టమోటా ఎగుమతి చేస్తారు. గత ఏడాది జూన్‌లో రూ. 40కి విక్రయించిన టమోటా ఈ ఏడాది రెట్టింపు ధర పలుకుతుంది. ఇంత ధర పెట్టినా నాసిరకం సరకు రావడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారు. హోల్‌సేల్‌గా కొనుగోలు చేసిన సరకులో చాలావరకు రద్దుగానే పోతుందని వ్యాపారులు వాపోతున్నారు. విశాఖ జిల్లా పరిసర ప్రాంతాల్లో జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు కూరగాయల సాగు ఉంటుంది. టమోటాను స్థానికంగా పండించి అమ్మకం చేస్తారు. ఈ సమయంలో కేజీ రూ. 10 నుంచి రూ. 15 వరకు అమ్మకం జరుగుతుంది.
 
విశాఖ జిల్లా వారు మే నెల నుంచి మదనపల్లి మార్కెట్‌పైనే ఆధారపడతారు. ఎన్నడూ లేనివిధంగా అక్కడి మార్కెట్లో ధర ఆకాశాన్ని అంటిందని హోల్‌సేల్‌ టమోటా వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మరికొన్ని రోజుల్లో పంటకు చేతికి వచ్చే అవకాశం ఉందని, దీంతో ధరతగ్గే అవకాశం ఉందని అప్పటిదాకా ధరలు తగ్గే అవకాశం లేదని అంటున్నారు. ఎన్నడూ లేని విధంగా టమాటా ధర పెరగడంతో ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి ధరను నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.