శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 డిశెంబరు 2023 (16:50 IST)

కార్తీక సోమవారం.. నదీ స్నానాలకు వెళ్లి ఇద్దరు మహిళల మృతి

కార్తీక సోమవారం కావడంతో పుణ్యస్నానాల కోసం వెళ్లిన ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లాలోని కసింకోట మండలంలోని జోగారావుపేట గ్రామానికి చెందిన నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగ అనే ఇద్దరు మహిళలు శారదానదికి నదీ స్నానాలకు వెళ్లారు. నదిలోకి దిగగానే ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. 
 
ఇది గమనించిన స్థానికులు ఆ నలుగురు మహిళల్లో ఇద్దరు మహిళలను రక్షించగలిగారు. కాగా నారపురెడ్డి లక్ష్మి, అరట్ల మంగనీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.