1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

నకిలీ ధృవపత్రాల తయారీలో వలంటీర్ల.. అరెస్టు.. ఎక్కడ?

arrest
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి అమల్లోకి తెచ్చిన వాలంటరీ వ్యవస్థలోని పలువురు వాలంటీర్లు అడ్డుదారులు తొక్కుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇటీవల బంగారం, డబ్బు కోసం ఒ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడు. ఇపుడు మరో వాలంటీర్ ప్రభుత్వ పథకాలను పొందేందుకు నకిలీ ధృవపత్రాలు తయారు చేసి జైలుపాలయ్యాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా అచ్యుతాపురంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన సచివాలయంలో పని చేస్తున్న డిజిటల్ సహాయకుడు సుధీర్ అనే వ్యక్తి ఓ అవివాహితుడు. డిజిటల్ కీ ఉపయోగించి వివాహమైనట్టు ఓ నకిలీ వివాహ పత్రానికి సృష్టించుకున్నాడు. అలాగే, సచివాలయంలోని మహిళా పోలీసులు బురుగుబెల్లి రాజేశ్వరి, పైలా వెంకటలక్ష్మి భర్తలతో కలిసి ఉంటున్నా విడాకులు తీసుకున్నట్టు నకిలీ పత్రాలు తయారు చేశాడు.
 
ఈ విషయాన్ని గుర్తించిన పంచాయితీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు... సచివాలయ ఉద్యోగులతో పాటు వారికి సహకరించిన వాలంటీర్ నానాజీపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరిపై నామమాత్రపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో వారు జైలు నుంచి బయటకు వచ్చారు.