1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 24 జులై 2023 (16:32 IST)

పవన్ కళ్యాణ్‌పై పరువు నష్టం దావా... హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వాలంటీర్

pawan kalyan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై ఓ పరువు నష్టం దావా కేసు నమోదైంది. ఓ మహిళా వాలంటీర్ ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసును వేశారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తమను మానసికంగా వేధించారంటూ విజయవాడకు చెందిన వాలంటీర్ స్థానిక సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
ఈ సందర్భంగా మహిళా వాలంటీర్ మాట్లాడుతూ, తన పరువుకు భంగం కలిగిందంటూ ఈ పరువు నష్టం దావా వేసినట్టు చెప్పారు. వాలంటీర్లుగా తాము మహిళల డేటాను సేకరించామని, డేటా చోరీ చేశామని పవన్ కళ్యాణ్ ఆరోపించారని, ఈ వ్యాఖ్యలతో తమ మనోభావాలతో దెబ్బతిన్నాయని వాపోయారు. ఉమెన్ ట్రాఫికింగ్ అంటూ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. సేవ చేస్తున్న తమపై నిందలు వేసిన పవన్ కళ్యాణ్‌పై చట్టపరంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రస్తుతానికి తాను ఒక్కరినే ఈ తరహా పిటిషన్‌ను దాఖలు చేశానని, మున్ముందు తనను చూసి మరింకొందరు దాఖలు చేస్తారని చెప్పారు.