సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (13:58 IST)

టిటిడి భద్రతా వ్యవస్థపై ట్రైనీ ఐపీఎస్‌లకు అవగాహన

దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన 24 మంది ట్రైనీ ఐపిఎస్ అధికారులకు టిటిడి సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు కలిసి భద్రతా వ్యవస్థపై అవగాహన కల్పించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈ కార్యక్రమం జరిగింది. ట్రైనీ ఐపిఎస్‌ల బృందంలో నేపాల్‌కు చెందిన ఇద్దరు మహిళా అధికారులు ఉన్నారు.
 
ఈ సందర్భంగా టిటిడి నిఘా మరియు భద్రతా విభాగం కార్యకలాపాలు, తిరుమల భద్రతకు సంబంధించి అర్బన్ పోలీసులు తీసుకునే చర్యలను వివరించారు.
 
అంతకుముందు ట్రైనీ ఐపీఎస్ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, లడ్డూ కౌంటర్లు తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో భక్తుల భద్రతకు సంబంధించి టిటిడి అవలంబిస్తున్న విధానాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.