ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 21 ఆగస్టు 2022 (09:32 IST)

రాజోలులో ఒకే కాన్పులు ముగ్గురు ఆడపిల్లలు.. మగబిడ్డ పుట్టివుంటే..?

babies
కోనసీమ జిల్లా రాజోలులో ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. ఓ తల్లి నవమాసాలు ముగ్గురు బిడ్డలను మోసి వారికి జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం, ఊడిమూడి గ్రామానికి చెందిన నాగరాజు, భవాని భార్యాభర్తలు. వారి పెళ్లి జరిగి మూడేళ్ళు అయ్యింది. 
 
ఇక తాజాగా యిల్లింగి భవాని పురిటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. ఇక ఆమె గర్భంలో ముగ్గురు కవల పిల్లలు ఉన్నారు అని గుర్తించిన ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ముగ్గురు కవల పిల్లలను డెలివరీ చేశారు. 
 
కానీ పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు చాలా ఆరోగ్యంగా ఉన్నారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ముగ్గురు పిల్లలు పుట్టటం ఆనందంగా ఉందని భవాని భర్త నాగరాజు వెల్లడించారు. 
 
అయితే రోజువారి కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు ఒకే కాన్పులో ముగ్గురు ఆడపిల్లలు పుట్టడం కాస్త భారమని తండ్రి నాగరాజు చెబుతున్నాడు. మగబిడ్డ ఒక్కడైనా పుట్టివుంటే బాగుండేదని చెప్తున్నాడు. అయినా దేవుడిచ్చిన బిడ్డల్ని బాగా పెంచుకుంటామని చెప్పాడు.