సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , బుధవారం, 1 డిశెంబరు 2021 (13:33 IST)

తిరుమ‌ల ప్ర‌యాణికులు ఓ వారం వాయిదా వేసుకోవాలి...

ఇప్ప‌టికే ఆన్ లైన్ లో టిక్కెట్లు తీసుకున్న భ‌క్తులు త‌మ దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి  హామీ ఇచ్చారు. గ‌త 20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిసాయని, దీనితో కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింద‌ని ఆయన వెల్లడించారు. 
 
 
కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించేందుకు ఢిల్లీ నుంచి ఐఐటి నిపుణులును రప్పిస్తున్నామ‌ని  స్ఫష్టం చేశారు. ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమత్తు పనులుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలుకు అనుమతిస్తామని వెల్లడించారు. అయినా, భ‌క్తులు త‌మ రాక‌ను ఒక వారం వాయిదా వేసుకోవాల‌ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్న్ణ‌ప్తి చేశారు.