టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు: వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో భక్తులు సులభంగా పొందేలా టీటీడీ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
కరోనా దృష్ట్యా టికెట్లను ఆన్‌లైన్‌లోనే కేటాయిస్తుండడంతో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన పేర్కొన్నారు. గత నెలలో జియో యాప్ ద్వారా టికెట్లను విడుదల చేశామన్నారు.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు సులభంగా టికెట్లు పొందారని ఆయన తెలిపారు. టీటీడీ సేవలన్నీ ఒకే యాప్‌లోకి తెచ్చేవిధంగా జియోతో ఎంవోయూ కుదుర్చుకున్నామన్నారు. వైకుంఠ ఏకాదశి నాటికి అందుబాటులోకి నూతన యాప్ వస్తుందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.