1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 27 మార్చి 2017 (08:20 IST)

తిరుమలేశా కాపాడు.. మళ్లీ లడ్డు ధర పెంచుతున్నారు స్వామీ

భక్తుల నుంచి వందల కోట్ల రూపాయలను హుండీల రూపంలో, సేవల రూపంలో ఏటా పొందుతున్న టీడీడీకి ఏం పోయే కాలమొచ్చిందో ఏమో కానీ మళ్లీ తిరుమలేశుని లడ్డు ధరలు పెంచాలని చూస్తోంది. లడ్డు ధర మాత్రమే కాదు. తిరుమల శ్రీనివ

భక్తుల నుంచి వందల కోట్ల రూపాయలను హుండీల రూపంలో, సేవల రూపంలో ఏటా పొందుతున్న టీడీడీకి ఏం పోయే కాలమొచ్చిందో ఏమో కానీ మళ్లీ తిరుమలేశుని లడ్డు ధరలు పెంచాలని చూస్తోంది. లడ్డు ధర మాత్రమే కాదు. తిరుమల శ్రీనివాసుడు ఆర్జిత సేవలు, వీఐపీ టిక్కెట్లు, కాటేజీల అద్దెలు వంటివన్నీ మరోసారి పెంచేసే పథకాలకు బోర్డు సిద్ధమవుతోంది.
 
సోమవారం అంటే నేడు జరగనున్న ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ ధరల పెంపు అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌ అతిథి గృహంలో టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు నేతృత్వంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. అయినా సైజు తగ్గిన తిరుమల లడ్డుకు 25లు ధరపెట్టి చంపుతున్న టీటీడీకి లడ్డు తయారీలో అంత నష్టం వస్తోందా. 3 వేల కోట్లకు పైగా భక్తుల ద్వారా వచ్చిన ఆర్జనను ఇప్పటికే బ్యాంకుల్లో పెట్టిన టీటీడీకి భక్తులకు కనీస సౌకర్యాలు కూడా అందించడం కష్టమైపోతోందా.? 
 
ఇలాగయితే నీ లడ్డు ధర పెంచకుండా మీ వాళ్లకు కాస్త చెప్పు స్వామీ అంటూ భక్తులు నేరుగా తిరుమలేశుడికే విన్నవించుకునే కాలం ఒకటి వస్తుందేమో మరి.