మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 మార్చి 2015 (18:23 IST)

తెలంగాణ ఆర్థిక బడ్జెట్.. టీటీడీపీ సెటైర్లు.. అల్లుడు, కొడుకు.. శాఖలకే..?!

తెలంగాణ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై టీటీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. కేబినెట్‌లో మహిళలకు అన్యాయం చేసిన టీఆర్ఎస్, బడ్జెట్‌లో కూడా వారిని అన్యాయం చేసిందని మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించారని... టీఆర్ఎస్ ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెట్టాలని అన్నారు. స్వైన్ ఫ్లూని కంట్రోల్ చేయడం చేతకాని ఈ ప్రభుత్వం... హెలికాప్టర్ అంబులెన్స్‌లో వైద్యం అందిస్తామనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 
 
శాసన మండలిలో టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేశామని అనడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. జాతీయగీతాన్ని అడ్డం పెట్టుకుని మా గొంతు నొక్కేశారని విరుచుకుపడ్డారు. టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి, ఎల్.రమణ, వెంకటవీరయ్యలు మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. 
 
మరోవైపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్తవ విరుద్ధంగా బడ్జెట్ ఉందని ఆరోపించారు. అంతేగాకుండా, కేవలం అంకెల గారెడీని తలపిస్తోందన్నారు. బడ్జెట్‌లో సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్, అల్లుడు హరీష్ రావుకు చెందిన శాఖలకే భారీగా నిధులు కేటాయించారని ఆరోపించారు. అన్ని వర్గాలకు ఈ బడ్జెట్ నిరాశ కలిగించిందని అన్నారు.