మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 12 సెప్టెంబరు 2020 (19:18 IST)

తిరుమల కల్యాణకట్ట క్షుర‌కుల‌కు యూనిఫాం విరాళం

తిరుమల కల్యాణకట్టలో విధులు నిర్వ‌హిస్తున్న పురుష‌, మహిళా క్షుర‌కుల‌కు రూ.10 ల‌క్ష‌లు విలువ గ‌ల రెండు జ‌త‌ల పంచ‌లు, ష‌ర్టులు, చీర‌ల‌ను శ‌నివారం ఉద‌యం టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళంగా అందించారు.
 
తిరుమ‌ల ప్ర‌ధాన కల్యాణ‌క‌ట్ట‌లో 1050 మంది పురుష‌ క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల పంచ‌లు, షర్టులు 2,100 పంచ‌లు, షర్టులు, 275 మంది మహిళా క్షుర‌కుల‌కు రెండు జ‌త‌ల చీర‌లు, మొత్తం 550 చీరలు టిటిడి అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి పంపిణీ చేశారు.
 
ఈ సంద‌ర్భంగా క‌ల్యాణ‌క‌ట్ట క్షుర‌కులు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యురాలు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియ‌జేశారు. కరోనా సమయంలో కళ్యాణకట్ట ఉద్యోగస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వారి కోసం ప్రత్యేకంగా యూనిఫాంలను అందించడం ఎంతో సంతోషంగా ఉందని ధర్మారెడ్డి తెలిపారు.