మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 7 సెప్టెంబరు 2020 (20:23 IST)

శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో స్వామివారి దర్శనం చాలా సుళువు, ఎలా?

సాధారణంగా తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలంటే ఎంతో అంగరంగవైభవంగా నిర్వహిస్తుంటారు. లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. స్వామివారి వాహన సేవలను తిలకించేందుకు పెద్దఎత్తున వస్తుంటారు. భక్తుల తాకిడిని బ్రహ్మోత్సవాల సమయంలో అస్సలు తట్టుకోలేరు టిటిడి అధికారులు.
 
అయితే ఈ యేడాది మాత్రం బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే టిటిడి పాలకమండలిలో ఇదే విషయంపై నిర్ణయం కూడా తీసేసుకున్నారు. వాహన సేవలన్నీ ఏకాంతంగానే జరిపేందుకు అన్ని ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. 
 
ఈ నేపథ్యంలో టిటిడి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచింది. ఈ నెల 15వ తేదీ, అలాగే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. 15వ తేదీ అంకురార్పణ, 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల సమయంలో కూడా ప్రత్యేక ప్రవేశ దర్సనం టిక్కెట్లు ఇవ్వాలని టిటిడి నిర్ణయించుకుని ఆన్లైన్లో టిక్కెట్లను విడుదల చేసింది. కొద్దిసేపటి క్రితమే ఈ టిక్కెట్లను ఆన్లైన్లో ఉంచారు. అయితే భక్తులు పోటీలు పడి మరీ టిక్కెట్లను పొందుతున్నారు.