శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:53 IST)

విధుల్లో చేరేముందు... "సింగం" సినిమాను గుర్తుకు తెచ్చుకోండి : ప్రధాని మోడీ

శిక్షణ పూర్తి చేసుకున్న ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తమిళ హీరో సూర్య నటించిన సింగం సినిమాను గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. ఈ ఐపీఎస్ అధికారులంతా స‌ర్దార్ వ‌ల్ల‌భ్‌ భాయ్ ప‌టేల్ జాతీయ పోలీసు అకాడ‌మీలో శిక్ష‌ణ పూర్తి చేసుకున్నారు. ఈ అధికారుల‌ దీక్షాంత్ పెరేడ్ శుర్రవారం జ‌రిగింది. 
 
ఈ పాసింగ్ అవుట్ పెరేడ్‌కు బ్యాచ్ ఉత్త‌‌మ ప్రొబేష‌న‌ర్ డి.వి. కిర‌ణ్ శృతి నాయ‌క‌త్వం వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన‌ మంత్రి  నరేంద్ర మోడీ వీడియోకాన్ఫ‌రెన్సు ద్వారా ముఖ్యఅతిథిగా పాల్గొని, పాసింగ్ అవుట్ పెరేడ్‌లో పాల్గొన్న ప్రొబేష‌న‌ర్ల‌తో ముచ్చ‌టించారు. శారీర‌క దారుఢ్య ప్రాధాన్య‌త‌ను ప్ర‌స్తావిస్తూ శిక్ష‌ణ‌ పూర్తి చేసుకున్న వారు శారీర‌క దారుఢ్యాన్ని కాపాడుకోవాల‌ని, ఇది వారి విధిలో భాగ‌మ‌న్నారు. మంచి మ‌నిషిగా ఉండ‌‌లేని వారు మంచి అధికారి కాలేర‌న్నారు. 
 
ముఖ్యంగా, విధుల్లో చేరేముందు సింగం సినిమాను ఓ సారి గుర్తుచేసుకోవాలన్నారు. ఆ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ ఎవరికీ తలవంచకుండా తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడని గుర్తు చేశాడు. అలాగే, స‌మాజానికి ఉప‌యొగ‌ప‌డే అంశాల‌ను ఎంచుకుని వాటిని సాధించేందుకు ప్ర‌య‌త్నించాల‌ని పిలుపునిచ్చారు. స‌మాజంలోని నిగూఢంగా ఉన్నశక్తి సామర్ధ్యాలు ఉప‌యోగించుకుని, ప్రజలకు ఉపయోగపడే ల‌క్ష్యాల సాధ‌న‌కు కృసి చేయాలని ఆయ‌న సూచించారు. ఈ కార్యక్రమంలో కేంద్రం హోం మంత్రులు అమిత్ షా, జి.కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.