శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:27 IST)

క్యాట్ కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఉచిత మాక్‌ పరీక్షలు నిర్వహించనున్న యుఎన్‌అకాడమీ

భారతదేశంలో అతిపెద్ద అభ్యాస వేదిక యుఎన్‌ అకాడమీ ఇప్పుడు మూడంచెల క్యాట్‌ సంసిద్ధతా కార్యక్రమాన్ని క్యాట్‌ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నిర్వహించబోతుంది. దీనిలో టీ 20 డెయిలీటెస్ట్‌ సిరీస్‌,  పూర్తి స్థాయి మాక్‌ పరీక్షలతో కాట్‌ చాంఫియన్‌‌షిప్‌ మరియు అత్యాధునిక కార్యక్రమం క్యాట్‌ వర్క్‌షాప్స్‌ ఉంటాయి.
 
ఈ సమగ్రమైన క్యాట్‌ ప్రిపరేషన్‌ నమూనా, క్యాట్‌ పరీక్ష కోసం తమ సంసిద్ధతను విశ్లేషించడం, సవరించడం మరియు తిరిగి సంసిద్ధులు కావడంలో విద్యార్థులకు సహాయపడుతుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని క్యాట్‌ పరీక్ష కోసం సిద్ధమవుతున్న విద్యార్ధులకు సహాయపడే రీతిలో తీర్చిదిద్దారు.
 
యుఎన్‌ అకాడమీ ప్లాట్‌ఫామ్‌ ఉపయోగించి, అభ్యాసకులు సమర్థవంతంగా క్యాట్‌ కోసం అత్యున్నత విద్యావేత్తలు అయినటువంటి అరుణ్‌ శర్మ, మీనాక్షీ ఉపాధ్యాయ్‌, అభిలాష స్వరూప్‌, రవి ప్రకాష్‌, భారత్‌ గుప్తా వంటి వారి మార్గనిర్దేశకత్వంలో ఫీడ్‌బ్యాక్‌, వ్యూహ సదస్సులు మరియు వర్క్‌షాప్‌ల ద్వారా తోడ్పడుతుంది. అభ్యర్థులు యుఎన్‌ అకాడమీ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ పైన లాగిన్‌ కావడం మరియు యుఎన్‌ అకాడమీ క్యాట్‌ చాంఫియన్‌షిప్‌, టీ20 లేదా క్యాట్‌ వర్క్‌షాప్‌ కోసం తమంతట తాము నమోదు చేసుకోవడం ద్వారా మరియు తమ జ్ఞానం పరీక్షించుకోవడం మరియు నైపుణ్యం వృద్ధి చేసుకోవడం చేసుకోవచ్చు.
 
క్యాట్‌ కోసం టీ20 డెయిలీ టెస్ట్‌ సిరీస్‌: ఈ టెస్ట్‌ సిరీస్‌ను ఆగస్టు 24 నుంచి అక్టోబర్‌ 4, 2020వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల నడుమ నిర్వహిస్తారు. ఈ పరీక్షను వారానికి ఓమారు నిర్వహిస్తారు. దీనిలో 20 ప్రశ్నలు ఉంటాయి. వీటిని ఒక గంట వ్యవధిలో పూరించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి మాక్‌ పరీక్షలలో క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, వెర్బల్‌ ఎబిలిటీ మరియు పఠనము యొక్క అవగాహన వంటివి ఉంటాయి. అభ్యాసకులు వేగవంతమైన విశ్లేషణ సదస్సులను ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5.30 గంటల నడుమ పొందగలరు. అత్యున్నత విద్యావేత్తలైనటువంటి అభిలాష స్వరూప్‌, లోకేష్‌ అగర్వాల్‌ మరియు అగ్నిమిత్ర అమన్‌లు ఈ సదస్సులను తీసుకోనున్నారు.
 
క్యాట్‌ చాంఫియన్‌షిప్‌: అభ్యర్థులకు తమ బలాలను అంచనా వేసుకునే అవకాశం క్యాట్‌ చాంఫియన్‌షిప్‌ అందిస్తుంది. ఈ క్యాట్‌ పరీక్ష అనుభవాన్ని ఐదు ఉచిత పూర్తిస్ధాయి మాక్‌ పరీక్షల ద్వారా అందుకోవచ్చు. ఈ పరీక్షలు ఆగస్టు 29 నుంచి జరుగుతాయి. ఈ ఐదు మాక్‌ పరీక్షలను మూడు గంటల కాల వ్యవధిలో నిర్వహిస్తారు మరియు అత్యున్నత ర్యాంకులు సాధించిన ఐదుగురికు యుఎన్‌ అకాడమీకి చెందిన ఐదుగురు విద్యావేత్తలతో ముఖాముఖి సంభాషించే అవకాశం కలుగుతుంది.
 
యుఎన్‌ అకాడమీ క్యాట్‌ వర్క్‌షాప్‌- అడ్వాన్డ్స్‌ ప్రోగ్రామ్‌: అడ్వాన్డ్స్‌ వర్క్‌షాప్‌లో వివరణలు మరియు క్యాట్‌ కోసం అవసరమైన భోదనాంశాలకు సంబంధించిన బోధన ఉంటుంది. దీనిని క్యాట్‌ ప్రిపరేటరీ సర్కిల్‌లో అత్యున్నత విద్యావేత్తలు కవర్‌ చేస్తారు. ఈ వర్క్‌షాప్‌ సెప్టెంబర్‌ 5న ప్రారంభమై 22 నవంబర్‌ వరకూ కొనసాగుతుంది. అభిలాష స్వరూప్‌, టాప్‌ ఎడ్యుకేటర్‌, క్యాట్‌ ప్రిపరేషన్స్‌, యుఎన్‌ అకాడమీ మాట్లాడుతూ, ‘‘సరైన ఎంబీఏ కాలేజీలో చదవడమన్నది ప్రతి క్యాట్‌ అభ్యర్ధి యొక్క కలగా ఉంటుంది.
 
ఈ కలను సాకారం చేయడంలో సహాయపడేందుకు యుఎన్‌ అకాడమీ ఇప్పుడు టీ 20 డెయిలీ పరీక్షలు మరియు యుఎన్‌ అకాడమీ చాంఫియన్‌షిప్‌ వంటివి నిర్వహిస్తుంది. వీటి ద్వారా మీరు మీ ప్రతిభను పరీక్షించుకోవచ్చు. ప్రతి క్యాట్‌ అభ్యర్థీ ఈ పరీక్షలలో పాల్గొనాల్సిందిగా నేను సూచిస్తున్నాను. మీరు కోరుకున్న కాలేజీలో సీటు పొందేందుకు భరోసా కలిగి ఉండేందుకు ఈ వర్క్‌షాప్‌లలో భాగం కావాడానికి ప్రయత్నించాల్సిందిగా సూచిస్తున్నాను’’ అని అన్నారు.
 
మీనాక్షీ ఉపాధ్యాయ్‌, టాప్‌ ఎడ్యుకేటర్ క్యాట్‌‌, యుఎన్‌ అకాడమీ మాట్లాడుతూ, ‘‘ మీ స్కోర్‌ను మెరుగుపరుచుకునేందుకు ప్రతి రోజూ పరీక్షలలో పాల్గొనడం తప్పనిసరి. యుఎన్‌ అకాడమీ వద్దనున్న పూర్తి స్థాయి పరీక్షలు మీకు అసలైన క్యాట్‌ అనుభవాలను అందిస్తాయి. పరీక్షల కోసం సమగ్రంగా సిద్ధమయ్యేందుకు ఇది అత్యవసరం. యుఎనర్‌ అకాడమీ వేదికపై ఉన్న ఈ కార్యక్రమాలన్నీ అసాధారణ ప్రదర్శన కనబరిచేందుకు భరోసా అందించడానికి వెన్నుముకగా నిలుస్తాయి’’ అని అన్నారు.