బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2024 (08:43 IST)

అలా చేయడమే నిజమైన సనాతన ధర్మం : ఉపాసన

upasana
అపోలో గ్రూపు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి నుంచి తాను అనేక మంచి మంచి విషయాలు నేర్చుకున్నట్టు హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ ఉపాసన వెల్లడించారు. ఆమె తాజాగా సనాతన ధర్మంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోగుల పట్ల గౌరవ మర్యాదలతో వ్యవహరిస్తూ వారికి వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని, ఇది తమకు తమ తాతయ్య చెప్పిన అంశమని వెల్లడించారు. 
 
రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించాలి. వారి పట్ల గౌరవం చూపుతూ వైద్యం అందించాలి అని తాతయ్య నేర్పించారు. ఆయన మాటలే మాకు స్ఫూర్తి. తిరుపతి, శ్రీశైలం, కేదార్నాథ్, బద్రీనాథ్‌లలో అపోలో ఉచిత అత్యవసర చికిత్సా సెంటర్లు ఏర్పాటు చేశాం. తాజాగా అపోలో ఉచిత కేర్ సెంటర్‌ను అయోధ్య రామ మందిరం వద్ద కూడా ఏర్పాటు చేశాం. ఈ అత్యవసర ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాం. మాకు మద్దతుగా నిలిచినవారికి ధన్యవాదాలు అంటూ తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేశారు.