ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 30 జులై 2024 (12:25 IST)

పారిస్ ఒలింపిక్స్ 2024: దక్షిణాది వంటకాల రుచి చూపించిన మెగాస్టార్

Paris2024: Mega Family
Paris2024: Mega Family
మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, కోడలు ఉపాసన కామినేనితో కలిసి ఇటీవల పారిస్ 2024 ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు ఆనందకరమైన క్షణాలను పంచుకున్నారు. ఈ క్రమంలో వారు అభిమానుల, మీడియా దృష్టిని ఆకర్షించారు.
 
మెగాస్టార్ సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక ఫోటోను పోస్ట్ చేశారు. అలాగే ఒలింపిక్ టార్చ్  ప్రతిరూపాన్ని పట్టుకుని, గేమ్స్‌లో పాల్గొనే భారతీయ అథ్లెట్లకు తన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరిన్ని అప్‌డేట్‌లను దాదాపు ప్రత్యక్షంగా పంచుకుంటున్నారు.
 
అలాగే పారిస్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు నేతృత్వంలోని ఒలింపిక్ గ్రామ పర్యటనతో సహా కుటుంబం వివిధ కార్యకలాపాలను ఆస్వాదించింది. అంతేగాకుండా పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా కొంతమంది క్రీడాకారులకు "అత్తమ్మ కిచెన్" పంపిణీ చేసింది. మెగాస్టార్ భార్య సురేఖ, ఉపాసన కలిసి ఇటీవల ప్రారంభించిన ఫుడ్ బ్రాండ్ ఇది. 
Paris Olympics
Paris Olympics
 
ఈ సందర్భంగా పారిస్‌లో క్రీడాకారులకు దక్షిణాది వంటకాల రుచిని చూపించారు మెగా కుటుంబం.  మరోవైపు, బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునేందుకు మెగా ఫ్యామిలీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందని నెటిజన్లు అంటున్నారు.