సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 9 జులై 2024 (18:41 IST)

మార్కెట్ వాటాను పొంది, అతిపెద్ద వాలెట్ ప్లేయర్‌గా మారిన మొబిక్విక్

Upasana Taku
భారతదేశపు అతిపెద్ద డిజిటల్ ఆర్థిక ఉత్పత్తులు సేవల ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన మొబిక్విక్ 2024 ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక సంఖ్యలో పీపీఐ వాలెట్ లావాదేవీలను నమోదు చేయడం ద్వారా గణనీయ మైలురాయిని సాధించింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ప్రచురించిన డేటా ప్రకారం, వస్తువులుసేవల కొనుగోలుకు సంబంధించి అదే విధంగా నిధుల బదిలీల కోసం పీపీఐ  వాలెట్ ద్వారా చేసే ఆర్థిక లావాదేవీలలో మొబిక్విక్ తన మా ర్కెట్ వాటాను పొందింది. విలువ ప్రకారం కంపెనీ మార్కెట్ వాటా మార్చి 2024లో 11% నుండి ఏప్రిల్‌లో 20%కి మరియు మేలో 23%కి పెరిగింది.
 
మొబిక్విక్ కొత్త ఉత్పత్తి, పాకెట్ యూపీఐ మొబిక్విక్ తన పరిధిని విస్తరించడంలో వినియోగదారులకు చెల్లింపులను సులభతరం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. పాకెట్ యూపీఐ వినియోగదా రులకు వారి బ్యాంక్ ఖాతాను లింక్ చేయకుండానే యూపీఐ నెట్‌వర్క్‌ లో వారి వాలెట్ల ద్వారా తక్షణ చెల్లిం పులు చేయడానికి తిరుగులేని మార్గాన్ని అందిస్తుంది. వినియోగదారులు తమ ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు తోడ్పడుతుంది.
 
అంతేగాకుండా టైర్ II, టైర్ III నగరాల్లో ప్లాట్‌ఫామ్‌ను విస్తృతంగా స్వీకరించడం ఈ వృద్ధికి కారణమని కంపెనీ పేర్కొంది. వినియోగదారు-స్నేహపూర్వక యాప్ మరియు లావాదేవీ భద్రతా చర్యలు అటు వినియోగదారులకు, ఇటు వ్యాపారులకు సహాయం చేయడానికి వీలుగా రూపొందించబడ్డాయి. ఈ మైలురాయిని సాధించడంపై మొబిక్విక్ సహ వ్యవస్థాపకురాలు, సీఎఫ్ఒ ఉపాసన టకు మాట్లాడుతూ, “పీపీఐ వాలెట్ మార్కెట్ వాటాలో కంపెనీ వృద్ధి అనేది వినూత్న, సురక్షిత వినియోగదారు-కేంద్రీకృత ఆర్థిక ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంపై మా దృష్టికి నిదర్శనం. సాంకేతికతతో నడిచే ఈ పరిష్కారాల ద్వారా ఆర్థిక చేకూర్పు అనే మా లక్ష్యానికి మేం కట్టుబడి ఉన్నాం’’ అని అన్నారు.
 
మార్కెట్ వాటా గురించి వివరిస్తూ, “మొబిక్విక్ ఫాస్ట్‌ ట్యాగ్ జారీ చేసే వ్యాపారంలో లేదు. ఫాస్ట్‌ ట్యాగ్ సంబంధిత లావాదేవీ విలువను మినహాయించిన తర్వాత, మే 2024లో పీపీఐ వాలెట్ లావాదేవీల విలువ ప్రకారం మొబిక్విక్ 48% మార్కెట్ వాటాను కలిగి ఉంది ” అని ఆమె అన్నారు. రెడ్‌సీర్ స్ట్రాటజీ కన్సల్టింగ్ సంస్థ ప్రకారం, “ఇలాంటి పోలిక ప్రకారం, మే 2024లో మొబిక్విక్ పీపీఐ వాలెట్ GMVలో 48% వాటాను కలిగి ఉంది. మొబిక్విక్ ఫాస్ట్‌ ట్యాగ్ సేవలను అందించదు. ఫలితంగా, ఇలా పోల్చినప్పుడు ఎన్ఈటీసీ ఫాస్ట్‌ ట్యాగ్ జీఎంవీ మొత్తం పీపీఐ వాలెట్ల జీఎంవీ నుండి మినహాయించబడింది, ఎందుకంటే చాలా బ్యాంకుల పీపీఐ వాలెట్‌లు ప్రధానంగా ఫాస్ట్‌ ట్యాగ్ లావాదేవీల కోసం ఉపయోగించబడతాయి. ఈ విశ్లేషణలో, ఎన్ఈటీసీలో నమోదు చేయబడిన అన్ని ఫాస్ట్‌ ట్యాగ్ లావాదేవీలు కేవలం వాలెట్ల ద్వారా మాత్రమే ప్రాసెస్ చేయబడతాయని భావించబడింది’’.