ఆదివారం, 10 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 జులై 2024 (10:50 IST)

ప్రీమియం పెట్రోల్.. నార్మల్ పెట్రోల్.. ఏది బెటర్!!

petrol
సాధారణంగా మన దేశంలో ఉండే పెట్రోల్ బంకుల్లో వివిధ రకాలైన పెట్రోల్ లభిస్తుంది. వీటిలో సాధారణ పెట్రోల్, పవర్, ప్రీమియం, ఎక్స్‌ట్రా ప్రీమియం ఇలాంటి రకాలు అందుబాటులో ఉంటాయి. అయితే, వాహనదారులు మాత్రం సాధారణ పెట్రోల్‌ వైపే మొగ్గు చూపుతుంటారు. దీని కారణం.. ఇతర పెట్రోల్స్‌తో పోల్చితే సాధారణ పెట్రోల్ ధర కాస్త తక్కువగా ఉండటం. ఖరీదైన కార్లు, బైకులు నడిపేవారు మాత్రం పవర్, ప్రీమియం, ఎక్స్‌ట్రా ప్రీమియం పెట్రోల్ కొనుగోలు చేస్తుంటారు. సాధారణం కంటే ప్రీమియం ఇంధనాల ధర ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని కొనుగోలు చేసే వారు తక్కువగా ఉంటారు. 
 
అయితే, సాధారణం, ప్రీమియం పెట్రోల్ ధరల్లో ఏది బెటర్ అనే విషయాన్ని పరిశీలిస్తే, ఈ రెండు రకాలైన ఇంధనాల మధ్య ఉన్న వ్యత్యాసం తెలియక పవర్, ప్రీమియం ఇంధనాలు కొనాలనుకున్నా వాటి వల్ల ఉపయోగం ఎంటో తెలియక ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తారు. మరి సాధారణ వాహనదారులకు ప్రీమియర్ ఇంధనంతో ఉపయోగం ఉంటుందా హైపవర్ వాహనాలకే ఇది పరిమితంగా అనే పర్శ్నలకు సవివరమైన సమాధానం ఇదన్నమాట. అత్యాధునిక బైకులు, కార్ల పికప్, మెయింటినెన్స్ బాగుండాలంటే హై పవర్ పెట్రోల్ వినియోగించడం మంచిదని ఆటోమొబైల్ రంగ నిపుణులు చెబుతున్నారు.