ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (07:44 IST)

సీబీఐ ఇంకా పట్టుకోలేదని బాధ పడుతున్నారా?: జగన్ పై వర్ల సెటైర్లు

టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య సీఎం జగన్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హ‌త్య కేసులో విచార‌ణ జ‌రుగుతోన్న తీరును ఆయ‌న ప్ర‌స్తావించారు. తాము అధికారంలోకి వ‌చ్చాక ముద్దాయిల‌ను ప‌ట్టుకుంటామ‌ని చెప్పారు.

‘ముఖ్యమంత్రి గారూ, మీ బాబాయిని హత్య చేసిన హంతకులను సీబీఐ ఇంకా పట్టుకోలేదని బాధ పడుతున్నారా? ఇప్పటి సీబీఐ అసలు ముద్దాయిలను పట్టుకొని మిమ్ము సంతోష పెట్టలేకపోతే రేపు మేము అధికారంలోకి వస్తాం,

తప్పక మీ బాబాయిని నరికి చంపిన అసలు ముద్దాయిలను పట్టుకుంటాం, వాస్తవాలు ప్రజల ముందుంచుతాం. ఓకేనా?’ అని వ‌ర్ల రామయ్య ప్ర‌శ్నించారు.