ఏపీకి శకుని మామలా విజయసాయి

vijayasai reddy
ఎం| Last Updated: శనివారం, 6 మార్చి 2021 (11:18 IST)
చంద్రబాబును విమర్శించే స్ధాయి, లోకేష్ పేరెత్తే అర్హత ఏ2 విజయసాయిరెడ్డికి లేదని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బ్రహ్మం అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ భారతంలో శకుని మామలా నేడు ఆంధ్రప్రదేశ్‌లో విజయసాయి వెలుగుతున్నారని విమర్శించారు.

ఆ శకుని మామ కుట్రలకు పాండవులు కష్టాలపాలైనట్లు విజయసాయిరెడ్డి కుట్రలకు విశాఖ ప్రజలు బలవుతున్నారన్నారు. విశాఖకి పరిపాలన రాజధాని వస్తుందో, రాదో తెలియదు కానీ... విజయసాయిరెడ్డి, జగన్ రెడ్డి అడుగడుగునా వైజాగ్‌కి చేస్తున్న అన్యాయాలకు, అక్రమాలకు నగర అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు.

వైజాగ్ ఓటర్లకు తెలివైనవారిగా పేరుందని... కచ్చితంగా విశాఖ ప్రజలు విజయసాయిరెడ్డి చేస్తున్న డెకాయిట్ పనులను తమ ఓటు అనే అస్త్రంతో తిప్పికొడతారని బ్రహ్మం ధీమా వ్యక్తం చేశారు.
దీనిపై మరింత చదవండి :