శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శనివారం, 17 జులై 2021 (13:20 IST)

విజయవాడ ఏసీపీకి వారం జైలు శిక్ష

విజయవాడ ఏసీపీ శ్రీనివాసరావుకు ఏపీ హైకోర్టు వారం రోజుల పాటు జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ, ఎస్టీ కేసులో ఛార్జిషీట్‌ వేయాలని విజయవాడ ఏసీపీని గతంలో హైకోర్టు ఆదేశించింది. 
 
ఆదేశాలు అమలు చేయకుండా తమను తప్పుదోవ పట్టించారన్న హైకోర్టు .. ఏసీపీకి వారం పాటు జైలుశిక్ష విధించింది. ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనతో తీర్పు అమలు హైకోర్టు వారంపాటు వాయిదా వేసింది.