బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 21 డిశెంబరు 2016 (15:51 IST)

కొత్త ఏటీఎం కార్డు వస్తుంది కానీ పాత కార్డు నెంబరు చెప్పండి... రూ.98,000 మాయం...

దొంగలు, దగుల్బాజీలు మోసం ఎప్పుడు చేయాలా అని ఎదురుచూస్తుంటారు. విజయవాడ కంకిపాడులో జరిగిన ఘటన ఇదే చెపుతుంది. కంకిపాడు మండలంలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీరాంబాబు, తనకు తన భార్యకు ఏటీఎం కార్డులు కావాలంటూ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. 1

దొంగలు, దగుల్బాజీలు మోసం ఎప్పుడు చేయాలా అని ఎదురుచూస్తుంటారు. విజయవాడ కంకిపాడులో జరిగిన ఘటన ఇదే చెపుతుంది. కంకిపాడు మండలంలోని గొడవర్రు గ్రామానికి చెందిన ఉప్పలపాటి శ్రీరాంబాబు, తనకు తన భార్యకు ఏటీఎం కార్డులు కావాలంటూ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. 15 రోజులయినా కార్డులు రాలేదు. ఇంతలో ఓ ఫోన్ కాల్ వచ్చింది. మీకు త్వరలో కొత్త ఏటీఎం కార్డులు వస్తాయి కానీ ప్రస్తుతం పాత ఏటీఎం కార్డు నెంబరు చెప్పండి అంటూ అడిగాడు. 
 
రాంబాబు తన పాత ఏటీఎం కార్డు నెంబరు, పిన్‌తో సహా చెప్పేశాడు. తన భార్య కార్డు వివరాలను కూడా మరీ చెప్పేశాడు. అంతే... 5 నిమిషాలు తిరక్కుండా ఇద్దరి ఖాతాల్లో ఉన్న రూ. 98,000 మాయమయ్యాయి. పైగా మీ ఖాతా నుంచి మీరు 98,000 తీసుకున్నారంటూ సందేశం కూడా వచ్చేసింది. దీనితో షాక్ తిన్న దంపతులు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.