మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (15:33 IST)

పోలీసుల అదుపులో నారా లోకేష్

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు చేపట్టిన 24 గంటల రిలే నిరాహార దీక్షాస్థలి వద్దకు వెళ్లి తిరిగొస్తుండగా.. కనకదుర్గమ్మ వారధి వద్ద లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
రాస్తారోకో వైపు వెళ్తున్నాడని.. అందుకే ఆయన్ను అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు. పార్టీ ఆఫీసుకి వెళ్తున్నానని చెప్పినప్పటికీ పోలీసులు వినలేదని లోకేష్‌ అనుచరులు మండిపడుతున్నారు. లోకేష్‌తో పాటు అదే వాహనంలో ప్రయాణిస్తున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారనే విషయం తెలియరాలేదు.