శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (17:26 IST)

ఐదుగురు పాకిస్తాన్‌ వ్యక్తుల అరెస్టు

మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్న పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులను గుజరాత్‌ పోలీసులు అరెస్టు చేశారు. పాక్‌ వ్యక్తుల నుంచి 35 కేజీల హెరాయిన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ. 175 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. తీరప్రాంతం గుండా డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ చేస్తున్నారని యాంటీ టెర్రరిస్ట్‌ స్కాడ్‌(ఏటీఎస్‌), గుజరాత్‌ పోలీసులకు నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో తీర ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహించారు.

పాకిస్తాన్‌ నుంచి చేపల బోటులో వచ్చిన ఐదుగురి వద్ద హిరాయిన్‌ను పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అన్నీస్‌(30), ఇస్మాయిల్‌ మహ్మమద్‌(50), ఆష్రఫ్‌ ఉస్మాన్‌(42), కరీం అబ్దుల్లా(37), అబుబాకర్‌ ఆష్రఫ్‌(55)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.