శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జనవరి 2020 (09:38 IST)

సూటు వేసుకున్న ఉగ్రవాది డోనాల్డ్ ట్రంప్ : ఇరాన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఇరాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అగ్రరాజ్యం అధిపతిని ఓ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఆయనో సూటు వేసుకున్న ఉగ్రవాది అంటూ ఆరోపించింది. ఇదే అంశంపై ఇరాన్ మంత్రి మహ్మద్ జావేద్ ట్వీట్ చేస్తూ, 'ఐసిస్‌, హిట్లర్‌, జంఘిస్‌.. అంతా సంస్కృతిని ద్వేషించేవారే. ట్రంప్‌ సూటు వేసుకున్న ఉగ్రవాది. గొప్ప దేశమైన ఇరాన్‌ను, ఇరాన్‌ సంస్కృతిని ఏ ఒక్కరూ ఓడించలేరన్న చరిత్రను ట్రంప్‌ అతి త్వరలోనే తెలుసుకుంటారు' అని వ్యాఖ్యానించారు.
 
అంతేకాకుండా మేం తలచుకుంటే శ్వేతసౌథంపైనా దాడి చేయగలం. అమెరికా గడ్డపైనే వారికి జవాబు ఇవ్వగలం. మాకు ఆ శక్తి ఉంది అని అన్నారు. అమెరికా కోరల్ని పీకిపారేయాల్సిందేనన్నారు. 52 లక్ష్యాలపై దాడి చేస్తామన్న ట్రంప్‌ హెచ్చరికలపై ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌ అబ్దుల్‌ రహీం మౌసావీ స్పందిస్తూ.. అమెరికాకు అంత ధైర్యం లేదన్నారు. సులేమానీ హత్యకు నిరసనగా టెహ్రాన్‌లో ఆదివారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.