మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (22:03 IST)

ప్రియాంకా గాంధీపై పోలీసుల దాడి

ఉత్తరప్రదేశ్ లక్నో పర్యటనలో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. పౌరహక్కు చట్ట సవరణ వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసిన మాజీ ఐఎఎస్ అధికారి దారపురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త టు వీలర్‌పై ప్రయాణించి వారి ఇంటికి చేరుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి వస్తున్న సందర్భంగా ప్రియాంకను మహిళా పోలీసులు అడ్డుకున్నారు. ఆమె గొంతుపై చేయి వేసి తోసివేశారు. ఈ ఘటనతో ఆమె షాక్‌కు గురయ్యారు.

వెంటనే తేరుకుని అక్కడ నుంచి కాలినడకన సమీపంలోని మీడియా పాయింట్‌కు చేరుకున్నారు..  తనపై పోలీసులు చేసిన దాడిని ప్రియాంక మీడియాకు వివరించారు.