శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 7 జూన్ 2020 (13:12 IST)

విపరీతమైన దాహం.. నీళ్లనుకుని శానిటైజర్ తాగేశాడు..

Sanitizers
వేసవి తాపం. విపరీతమైన దాహం వేసింది. అదే ఆ అటెండర్ పాలిట శాపంగా మారింది. వేసవిలో దాహాన్ని తీర్చుకునేందుకు అందుబాటులో ఉన్న శానిటైజర్‌ను నీళ్లనుకుని తాగిన అటెండర్‌ చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సత్తిబాబుకు శనివారం మధ్యాహ్నాం కార్యాలయంలో దాహం వేసింది.
 
పొరపాటున పక్కనే ఉన్న వాటర్‌ బాటిల్‌ బదులు శానిటైజర్‌ను తాగడంతో అస్వస్థకు గురయ్యాడు. దీంతో తోటి ఉద్యోగులు స్థానిక దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్సను అందజేశారు. ఇంటికి వెళ్లిన సత్తిబాబు అర్ధరాత్రి మరోసారి అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు.