శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 జూన్ 2020 (14:42 IST)

బెంగళూరులో మరో రిచ్ పెళ్లి, డీకె శివకుమార్ కుమార్తెతో కేఫ్ కాఫీ డే ఫౌండర్ మనవడు

బెంగళూరు సిటిలో మరో కొత్తజంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది. మొన్న హెచ్.డి కుమార స్వామి కుమారుడు వివాహం ఘనంగా జరుగగా ఈసారి మాత్రం కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కుమార్తె ఐశ్వర్యకు వివాహం జరుగబోతుంది. అయితే వరుడు ఎవరో తెలుసా? కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకులు వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డే.
 
శివకుమార్‌ పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేట్‌ పూర్తి చేసి తండ్రి వ్యాపారాలను చూసుకుంటున్నారు. మరోవైపు అమర్త్య తన తండ్రి మరణం తరువాత వ్యాపారాలు చూసుకుంటున్నారు. డీకే శివకుమార్ వీజీ సిద్ధార్థలు ఇద్దరు మంచి స్నేహితులు కావడంతో ఈ వివాహాం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాహ వేడుకలకు సంబంధించి రెండు కుటుంబాలు శివకుమార్ ఇంట్లో చర్చలు జరిపారు.
 ఆగస్టులో యువ జంట నిశ్చితార్థం జరగేలా ప్లాన్ చేస్తున్నాయి ఇరు కుటుంబాలు. గతంలో హెచ్‌డి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, కాంగ్రెస్ నాయకుడు ఎం. కృష్ణప్ప మనవరాలు రేవతిని వివాహం చేసుకున్న తరువాత మళ్లీ రిచ్ ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వివాహం బెంగళూరు సిటీలో ప్రత్యేకంగా నిలవనుంది.