మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:38 IST)

విశాఖపట్నంలో డ్రగ్స్ దందా.. క్రిస్టల్ రూపంలో డ్రగ్స్

drugs
విశాఖపట్నంలో డ్రగ్స్ దందా గుట్టు రట్టు అయ్యింది. ఈ కేసులో ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. 54 గ్రాముల డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చినవాల్తేర్‌లో పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేయగా ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
స్ఫటిక రూపంలో ఎండీఎంఏను అక్రమ రవాణా చేసి వినియోగిస్తున్నారని తేలింది. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి నిందితులు విక్రయిస్తుండగా.. తొలిసారి క్రిస్టల్ రూపంలో డ్రగ్స్ దొరికాయి. స్నేహితుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్టు నిర్దారించారు.