మంగళవారం, 18 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 14 జులై 2020 (11:45 IST)

విశాఖకు మహర్దశ, నౌకాశ్రయం విస్తరణకు కేంద్రం ఏర్పాట్లు

ఇప్పటికే ఊపందుకుంటున్న విశాఖ మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయి. ప్రధానంగా ఏపీ ప్రభుత్వం విశాఖను రాజధాని చేయడంతో మరిన్ని పరిశ్రమలతో విస్తరించే అవకాశాలున్నాయి.

తాజాగా కేంద్ర ప్రభుత్వం విశాఖ నౌకాశ్రయాన్ని మరింత విస్తరించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించడంలో మరిన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో విశాఖకు మహర్దశ ప్రారంభమయ్యింది.
 
నౌకాశ్రయం ఆధారంగా పరిశ్రమలు అభివృద్ధికి కేంద్రం సన్నహాలు చేస్తుంది. దీనికోసం ఓడరేవుకు అనుబంధంగా లక్షా పదివేల హెక్టారు భూమిని కేంద్రం కేటాయించింది. కేంద్రం ఎంపిక చేసిన నౌకాశ్రయంలో విశాఖ ఒకటి.
 
కోల్కత్తా, పారాదీప్, కాండ్లా, ముంబై, మార్మగోవా, న్యూమంగళూరు, చెన్నై వంటి నగరాలు ఇందులో ఉన్నాయి. దీంతో పరిశ్రమలు అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ. త్వరలో విశాఖ మరింత మహానగరంగా మారనుంది. తద్వారా ఏపీకి ఆదాయం పెరిగే అవకాశం మెండుగా ఉన్నది.