శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 12 జూన్ 2020 (19:28 IST)

విశాఖపట్నంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త జోనల్ కార్యాలయం ప్రారంభం

ఏప్రిల్ 1, 2020న ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్‌లను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన తరువాత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అడుగుజాడలతో 9500+ శాఖలు మరియు 13,500+ ఎటిఎంలతో కూడి, భారతదేశమంతటా నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.
 
విలీనం తరువాత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక శాఖ కలిగి ఉండి, భారతదేశపు ఐదవ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు మరియు నాల్గవ అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్‌గా అవతరించింది.
 
ఈ విజయవంతమైన విలీనం నేపథ్యంలో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కొత్త కంబైన్డ్ ఆర్గనైజషన్ నిర్మాణం యొక్క 18 జోనల్ కార్యాలయాలు మరియు 125 ప్రాంతీయ కార్యాలయాలను ప్రకటించింది.
 
దేశవ్యాప్తంగా విస్తారించాలనే వ్యూహాత్మక దృష్టితో చండీగఢ్, జైపూర్, మంగళూరు మరియు విశాఖపట్నంలో 4 కొత్త జోనల్ కార్యాలయాలు స్థాపించబడ్డాయి. దక్షిణ భారతదేశంలో రెండు కొత్త జోనల్ కార్యాలయాలు తెరవడం వల్ల ఈ కీలక ప్రాంతంలో బ్యాంకు తన అధిక మార్కెట్ వాటాను మరింత బలోపేతం చేస్తుంది. అదనంగా, సిమ్లా, అమృత్‌సర్, బరేలీ వంటి ప్రదేశాలలో 32 కొత్త ప్రాంతీయ కార్యాలయాలు తెరవబడుతున్నాయి.
 
భారతదేశమంతటా తన ఉనికిని బలోపేతం చేయడంతో, బ్యాంక్ జోనల్ మరియు ప్రాంతీయ కార్యాలయాలు దాని అభివృద్ధి యంత్రాలుగా ఉద్భవించాలని ఆశించబడ్డాయి.
 
బ్యాంకు యొక్క 100 సంవత్సరాల చరిత్రలో చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా, ఈ రోజు ఒక వర్చువల్ ఈవెంట్ జరిగింది. ఎండి మరియు సిఇఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, జోనల్ హెడ్స్, చీఫ్ జనరల్ మేనేజర్స్ మరియు జనరల్ మేనేజర్లతో సహా బ్యాంక్ నాయకత్వంలోని ప్రముఖ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
వర్చువల్ రిబ్బన్ కటింగ్ వేడుకతో వేడుక ప్రారంభమైంది. తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండి అండ్ సిఇఒ శ్రీ రాజ్ కిరణ్ రాయ్ జి. ప్రసంగించారు. శ్రీ రాయ్ గారు, తన ప్రసంగంలో కొత్త సంస్థ నిర్మాణం యొక్క దృష్టిని వివరించారు, “ఈ విలీనం తరువాత మా అడుగుజాడలలో జరిగే అభివృద్ధితో, పురోగమించే అవకాశాలను ఉత్తమంగా ఉపయోగించుకోవటానికి వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణ అత్యవసరం, దీన్ని దృష్టిలో ఉంచుకుని మెరుగైన అభివృద్ధిని నిర్ధారించడానికి మనం భారతదేశమంతటా ఉనికిని బలపరుస్తున్నాము. వ్యాపార వృద్ధి మరియు కస్టమర్ సేవపై దృష్టి సారిస్తున్నాము.”