శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By మోహన్
Last Modified: బుధవారం, 3 జూన్ 2020 (17:04 IST)

కియా మోటార్స్ నుండి రానున్న సెల్టో

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా అధునాతనమైన సౌకర్యాలతో కూడిన సరికొత్త కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీనికి సెల్టోస్‌గా పేరు పెట్టింది. ఈ కారును రూ. 9.89 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది.
 
మోటార్ తయారీ సంస్థలతో పోటీపడి కియా సంస్థ నుండి వచ్చిన తొలి కారు భారతదేశంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 1.5 లీటర్ పెట్రోల్, 1.4 లీటర్ జీడీఐ పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ సదుపాయాల్లో ఈ ఎస్‌యూవీ లభించనుంది.
 
భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్- SUVగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేయడానికి, కంపెనీ సెల్టోస్‌ను సరికొత్త ఫీచర్లతో రూపొందించింది. మొత్తం 16 వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ మోడల్ ధర రూ.9.89 లక్షల- రూ. 11.74 లక్షలుగా ఉంది.