శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (16:40 IST)

పద్మశ్రీ అవార్డుకు వైజాగ్ డాక్టర్ పేరు నామినేట్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన యువ కళాకారుడు డాక్టర్‌ గట్టెం వెంకటేష్‌ తన ప్రత్యేకమైన కళారూపానికిగాను పద్మశ్రీ అవార్డుకు  నామినేట్‌ అయ్యాడు. 
 
ఇప్పటికే తన మైక్రో ఆర్ట్‌ వర్క్‌ కోసం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులకెక్కిన వెంకటేష్‌.. అగ్గిపుల్లలు, పెన్సిల్లు, చాక్‌పీస్‌లు, టూత్‌పిక్స్‌, బ్యాంగిల్స్‌పై 500కు పైగా సూక్ష్మ శిల్పాలను చెక్కి ఇప్పటివరకు 100 అవార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
 
ఒక కుగ్రామంలో జన్మించిన వెంకటేశ్‌ తండ్రి రైతు, తల్లి గృహిణి. అతడి లక్ష్యాన్ని సాధించడానికి, అభిరుచిని నెరవేర్చడానికి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారు. గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి పట్టభద్రుడైన వెంకటేష్‌.. జర్మనీలోని పీస్ యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్‌లో డాక్టరేట్‌ అందుకున్నాడు.
 
కళలు, చేతిపనుల పట్ల తన అభిరుచిని పంచుకునే ఇతరులకు సహాయం చేయడానికి ‘వెంకీ ఆర్ట్స్’ను స్థాపించి కళాకారులుగా కెరీర్‌ను కొనసాగించాలనుకునే విద్యార్థులకు సహాయపడ్డాడు. ఇప్పటివరకు దాదాపు రెండు వేలకుపైగా విద్యార్థులను తీర్చిదిద్దాడు.