శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 31 జులై 2021 (16:24 IST)

ఒడిషా కూలీల మృతిపై సానుభూతితో స్పందించిన‌ సీఎం జ‌గ‌న్

గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒడిషా రాష్ట్రానికి చెందిన కూలీల మృతిపై మావనతాదృక్పథంతో స్పందించారు ఏపీ సీఎం వైయస్‌.జగన్‌.

మృతి చెందిన ఆరుగురు కూలీలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయ‌లు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు.

బతుకుతెరువు కోసం ఒడిషా నుంచి మన రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని సీఎం ఆదేశించారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను సీఎం జ‌గ‌న్ ఆదేశించారు.