ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (20:45 IST)

రాజమౌళి డిజైన్ చేసిన అసెంబ్లీ అదుర్స్: ''తెలుగు తల్లి'' పాదాలపై సూర్యకిరణాలు (వీడియో)

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్‌ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న రాజమౌళి.. ఏపీ రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అమరావతిలో పాలనా నగర భవనాలకు ఆయన కొన్ని సూచన

బాహుబలి సినిమా ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్‌ వైపు తిరిగి చూసేలా చేసిన జక్కన్న రాజమౌళి.. ఏపీ రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. అమరావతిలో పాలనా నగర భవనాలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అమరావతి నిర్మాణానికి సూచనలు చేశామని రాజమౌళి ఇప్పటికే ప్రకటించారు.
 
ముఖ్యంగా అసెంబ్లీ మధ్యలో తెలుగుతల్లి విగ్రహం ఏర్పాటుకు సూచనలిచ్చామని.. తెలుగుతల్లి పాదాలపై సూర్య కిరణాలు వచ్చే పడేలా ప్లాన్ చెప్పామని రాజమౌళి చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ప్రభుత్వానికి అందజేశామని రాజమౌళి చెప్పుకొచ్చారు.
 
ప్రస్తుతం రాజమౌళి సూచించిన అసెంబ్లీలో తెలుగు తల్లి వీడియో వైరల్ అవుతోంది. ప్రతి తెలుగువాడు గర్వపడేలా తెలుగుతల్లి విగ్రహం వుందని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియోలో అరసవల్లిలో సూర్యుని కిరణాలు సూర్యదేవునిని ఎలా తాకుతాయో అదే విధంగా.. అసెంబ్లీ మధ్య ఏర్పాటయ్యే తెలుగుతల్లి విగ్రహం పాదాలను కూడా సూర్యుని కిరణాలు తాకుతాయి. ఈ కాన్సెప్ట్ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.