శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ivr
Last Modified: సోమవారం, 4 డిశెంబరు 2017 (20:34 IST)

నో గ్రాఫిక్స్... అంతా ఎమోషన్సే, చెర్రీ-ఎన్టీఆర్ పాత్రలను చెక్కుతున్న జక్కన్న

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అనగానే దానిపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ చిత్రమంటే ఇంకేముంది... అంచనాలు ఆకాశాన్నంటేశాయి. వీళ్లిద్దరీ క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా వుండాలి, మరోవైపు ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇవ్వాలంటే

దర్శక ధీరుడు రాజమౌళి చిత్రం అనగానే దానిపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరినీ కలిపి మల్టీస్టారర్ చిత్రమంటే ఇంకేముంది... అంచనాలు ఆకాశాన్నంటేశాయి. వీళ్లిద్దరీ క్యారెక్టర్లు స్ట్రాంగ్‌గా వుండాలి, మరోవైపు ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ ఇవ్వాలంటే తమాషా కాదు. దానికి ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. ప్రస్తుతం రాజమౌళి అదే పని చేస్తున్నారట. 
 
బాహుబలి చిత్రంలో ఫుల్లుగా గ్రాఫిక్స్ పైనే ఆధారపడి తెరకెక్కించిన నేపధ్యంలో చెర్రీ-ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నారు. కానీ రాజమౌళి ఈ చిత్రాన్ని గ్రాఫిక్స్ వాడకుండా ఫుల్ ఎమోషన్స్‌తో లాగించేందుకు కసరత్తు చేస్తున్నారట. చిత్రంలో ఇద్దరు హీరోల పాత్రలను చెక్కుతున్నాడట జక్కన్న. తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కథా చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. మొత్తమ్మీద చెర్రీ-ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పండగే.