శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 24 జూన్ 2017 (11:19 IST)

జనసేన పార్టీలోకి రోజా జంప్.. నాగబాబుతో కలిసి పవన్‌తో రోజా భేటీ.. జగన్ తిట్టాడని?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై కన్నేసినట్లు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చిన న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై కన్నేసినట్లు తెలుస్తోంది. పద్ధతి మార్చుకోవాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. రోజా టీడీపీ నుంచి వైకాపాకు జంప్ అయినట్లు.. వైకాపా నుంచి జనసేన పార్టీలోకి జంప్ అయ్యేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 
 
పద్దతి మార్చుకోని పక్షంలో వేటు తప్పదని జగన్‌ వార్నింగ్ ఇవ్వడంతో.. రోజా పార్టీకి దూరమయ్యేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే విశాఖలో జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన మహాధర్నాకు రోజా దూరమయ్యారనే వార్తలు వినిపించాయి. పార్టీ మైలేజ్ కోసం తనను ఉపయోగించుకున్న జగన్, ప్రస్తుతం పక్కనబెట్టేందుకు పావులు కదుపుతున్నారని రోజా భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో విసిగిపోయిన రోజా.. వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని రాజకీయ వర్గాల సమాచారం. అంతేగాకుండా ఆమె పవన్ కల్యాణ్ అడుగు జాడల్లో నడిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
రాయలసీమకు చెందిన రోజా అక్కడి నుంచే జనసేన తరపున ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. జబర్దస్త్ టీవీ షోలో తన కో-హోస్ట్ అయిన నాగబాబుతో కలసి ఈ మధ్యనే పవన్ కల్యాణ్‌ను రోజా కలిశారని, పవన్ కూడా ఆమెకు సాదర స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.