Daily Horoscope
✕

చంద్రబాబు ఎందుకు మాట్లాడడు?: అంబటి రాంబాబు

Written By ఎం
Updated: సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (07:48 IST)
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన చంద్రబాబు,  మాజీ పీఎస్ పై ఐటీ దాడుల విషయంలో తనపై వస్తున్న ఆరోపణలను ఖండించేందుకు బాబు ఎందుకు మాట్లాడటం లేదని వైసీపీ ఎమ్మెల్యే అంబటి  రాంబాబు ప్రశ్నించారు.

మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు మౌనానికి అర్థమేంటి? మీ అబ్బాయి ఎందుకు మాట్లాడడు? అని ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగల్లా వీళ్లిద్దరూ ఉన్నారని, ఆ విషయం తెలియని టీడీపీ నేతలు అరుస్తున్నారని విమర్శించారు.

ప్రతి ఏటా స్వచ్ఛందంగా తన ఆస్తులను ప్రకటిస్తున్న చంద్రబాబుపై ఇలాంటి ఆరోపణలు చేయొద్దని టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ, చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఆయనపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి  2005లో కోర్టును ఆశ్రయించిన విషయాన్ని ప్రస్తావించారు.

చంద్రబాబు నిజాయతీపరుడైతే ‘స్టే’ ఎందుకు తెచ్చుకున్నారు? విచారణ జరిపించుకోవాలిగా?  ఈ కేసులో విచారణకు భయపడుతున్న చంద్రబాబు నీతిమంతుడా? అని ప్రశ్నించారు.

తన వ్యక్తిగత పీఎస్ పై ఐటీ దాడులకు సంబంధించి చంద్రబాబు సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు తప్పనిసరిగా విచారణ ఎదుర్కోవలసిందేనని, శిక్ష పడే పరిస్థితులు ఉన్నాయని జోస్యం చెప్పారు.

అన్నీ చూడండి

Rashmika Mandanna: హైదరాబాద్ టు బెంగుళూరు 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక మందన్నా

RC 17 Update: నేడు ఆర్.సి.17 సినిమా ఆఫీస్ ప్రారంభం - ఈనెల 25న పూజతో షూటింగ్ ప్రారంభం !

T. Gopichand :టి. గోపీచంద్ చిత్రం భరతవర్ష నుంచి నవదుర్గల వైభవాన్ని చాటిచెప్పే సాంగ్ రిలీజ్

Imanvi Ismail : ఫౌజీ సెట్‌లో ఇమాన్వికి భారీ ఇంటి విందుతో ప్రభాస్ సర్‌ప్రైజ్

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ గడపొద్దు.. రీటేక్ అవకాశం వుండదు.. సూర్య

తర్వాతి కథనం
Show comments