మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (05:41 IST)

త్వరలో చంద్రబాబు బస్సుయాత్ర?

ప్రభుత్వ వైఫల్యాలపై బస్సు యాత్ర చేసే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. 45 రోజుల బస్సుయాత్రను చంద్రబాబు ప్రతిపాదించినట్లు  ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ విషయాన్ని ఆయన పార్టీ మీటింగ్‌లో ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. 13 జిల్లాలు, 100కు పైగా నియోజకవర్గాలు కవరయ్యేలా యాత్ర చేయాలని భావిస్తున్నారు. జనచైతన్య పేరుతో బస్సు యాత్ర చేద్దామని సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే యాత్ర చేయాలనే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. విజయవాడ కానూరులో చంద్రబాబు అధ్యక్షతన తెదేపా రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది.

ఈ సమావేశానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, పార్టీ సీనియర్‌ నేతలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వేధింపులు.. పార్టీ బలోపేతంపై ఈ సమావేశంలో చర్చించారు.
 
17 నుంచి రాష్ట్రమంతటా ప్రజా చైతన్య యాత్ర
ప్రజా చైతన్య యాత్ర పేరుతో.. త్వరలోనే జనాల్లోకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ నేతలు తమ ఇబ్బందులను అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. అండగా ఉంటామని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు.

ఈ నెల 17 నుంచి అన్ని నియోజకవర్గాల్లో ప్రజాచైతన్య యాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాల కోత, 3 రాజధానుల అంశంపై ప్రజలను కలవనున్నారు. అలాగే.. ఇసుక, భూములు, గనుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.