శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:35 IST)

పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని చూశారు: చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ ఫైర్

టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని లోక్‌సభలో ప్రయత్నించారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి తనను హత్య చేశారని ఎఫ్ఐఆర్ తీసుకోగల సమర్థుడు చంద్రబాబు అని మాధవ్ వ్యాఖ్యానించారు. జగన్ న్యాయబద్ధంగా పాలన చేస్తున్నారని.. వక్రభాష్యం చెప్పడానికి ముందుకు రావొద్దని హితవు పలికారు.

రాయలసీమ జిల్లాల్లో ప్రజలు దుర్భర దారిద్య్రంలో బతుకుతున్నారన్నారు. కుట్ర కుతంత్రాలకు స్వస్తి చెప్పాలని సూచించారు.

గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టబోయినట్లుగా 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాయిటర్స్ పత్రికలలో తప్పుడు కథనం రాయించారన్నారు.