ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (06:21 IST)

చంద్రబాబు మాజీ పీఎస్‌ నివాసంలో ఐటీ సోదాలు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్‌ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.

చంద్రబాబు వద్ద చాలా కాలం పనిచేసిన శ్రీనివాస్‌.. గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయాక సాధారణ పరిపాలన శాఖకు తిరిగొచ్చేశారు. సాధారణ పరిపాలన శాఖలో స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.

విజయవాడ సిద్ధార్థ నగర్‌లో ఆయన నివాసముంటున్న అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు ఉదయం 5 గంటలకే ఇద్దరు పోలీసులు వచ్చినట్లు సమాచారం.

ఆయన వాకింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవగా ఎటూ వెళ్లేందుకు వీల్లేదని అడ్డుచెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఐటీ అధికారులు, సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులతో సహా వచ్చి సోదాలు నిర్వహించారు.