బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 అక్టోబరు 2023 (08:02 IST)

వైకాపా నేతల అరాచకం... భర్త ఇంటి ముందే రెండో భార్య మృతదేహం పూడ్చివేత

wife funeral
చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నేతలు మరోమారు రెచ్చిపోయారు. రెండో భార్య చనిపోతే భర్త ఇంటి ముందే మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. భార్య చనిపోతే కడచూపుకు కూడా రాలేదన్న అక్కసుతో వారు ఈ పనికి పాల్పడ్డారు. అంతటితో వారి ఆగ్రహం చల్లారకపోవడంతో భర్త ఇంటిలో చొరబడి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ అరాచకం జిల్లాలోని కుప్పం మండలం మల్లానూరు పంచాయతీ సింగారపురంలో ఆదివారం జరిగింది. 
 
తాగాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారపురం గ్రామానికి చెందిన చెన్నయ్యన్‌ అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. రెండో భార్య రత్నమ్మ గత కొన్నాళ్లుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమె అనారోగ్యంతో శనివారం చనిపోయింది. ఈ విషయాన్ని భర్తకు చేరవేశారు. 
 
అయితే, తన భార్యను కడసారి చూసేందుకు భర్త రాలేదు. దీంతో ఆగ్రహించిన రత్నమ్మ కుటుంబ సభ్యులు స్థానికి ప్రజాప్రతినిధిగా ఉన్న అధికార వైకాపా నేతలను ఆశ్రయించారు. ఆయన అండదండలతో రత్నమ్మ మృతదేహాన్ని తీసుకొచ్చి చెన్నయ్యన్ ఇంటి ముందు పాతిపెట్టారు. ఆ తర్వాత చెన్నయ్యన్ ఇంటిలోని చొరబడి ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేశారు. ఆ సమయంలో చెన్నయ్యన్ ఇంట్లో లేరు. దీంతో ఆయన న్యాయం కోరుతూ స్థానిక పోలీసులకు  ఫిర్యాదు చేశాడు.