శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (13:19 IST)

పెళ్లికి ముందే మైనర్ బాలికకు వేరే వ్యక్తితో సంబంధం.. భర్తను అలా..?

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా పోతోంది. తాజాగా వివాహేతర సంబంధంపై నిలదీసిన భర్తను ఓ భార్య సుత్తితో కొట్టి హత్య చేసింది. అ

మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. భార్యాభర్తల బంధానికి అర్థం లేకుండా పోతోంది. తాజాగా వివాహేతర సంబంధంపై నిలదీసిన భర్తను ఓ భార్య సుత్తితో కొట్టి హత్య చేసింది. అయితే తన భర్తది సహజ మరణమేనని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ మృతుడి కుటుంబసభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తానే హత్య చేసినట్టు నిందితురాలు అంగీకరించింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా కశింకోట పెదబజారు వీధిలో నక్కా నూకేశ్వరరావు అలియాస్ నూకేష్, అతని భార్య నివాసం ఉంటున్నారు. నూకేష్‌కు 27 ఏళ్ల వయస్సు. ఆయన భార్యకు 17 ఏళ్లు. మైనార్టీ తీరకముందే నూకేష్‌తో ఆమెకు వివాహం చేశారు.  అయితే పెళ్లి కాకముందే ఆ బాలికకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం నూకేష్‌కు తెలియదు. 
 
అంతేగాకుండా నూకేష్‌తో వివాహం ఆ బాలికకు ఏమాత్రం ఇష్టం లేదు. మూడేళ్ల క్రితం వివాహం అయినా.. మూడుసాల క్రితం కశింకోట కశింకోట పెదబజారుకు కాపురాన్ని మార్చారు. తన భార్యకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని నూకేష్ గుర్తించాడు. ఈ విషయమై భార్య, భర్తల మధ్య గొడవలు జరిగేవి. శనివారం ఇదే విషయంలో గొడవ జరిగింది. అంతేకాదు వివాహేతర సంబంధాన్ని వదులుకోవాలని భర్త నూకేష్ భార్యను హెచ్చరించాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన నూకేష్ భార్య ఇంట్లో ఉన్న సుత్తితో భర్త తలపై  కొట్టింది. 
 
అంతే తీవ్రంగా గాయపడి నూకేష్ ప్రాణాలు కోల్పోయాడు. సహజ మరణంగా చిత్రీకరించింది. కానీ నూకేష్ శరీరంపై ఉన్న గాయాలను చూసిన ఆమె సోదరి నిందితురాలిని ప్రశ్నించింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితురాలిని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.