శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 11 ఆగస్టు 2018 (17:46 IST)

ధోనీ ఆడుకునే టాయ్స్ ఇవే.. సాక్షి పెట్టిన ఫోటో

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు. తాజాగా ధోనీ భార్య సాక్షి, మహేంద్ర సింగ్ ధోనీ బైకులు వుంచే బిల్డింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ధోనీ అమితంగా

టీమిండియా మాజీ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోనీకి బైకులంటే చాలా ఇష్టమని అందరికీ తెలుసు. తాజాగా ధోనీ భార్య సాక్షి, మహేంద్ర సింగ్ ధోనీ బైకులు వుంచే బిల్డింగ్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ధోనీ అమితంగా ఇష్టపడే టాయ్స్ అనే ట్యాగ్‌లైన్‌తో సాక్షి సోషల్ మీడియాలో ఓ ఫోటోను పోస్టు చేసింది. 
 
పూర్తిగా గ్లాసుతో అత్యాధునిక నిర్మాణ శైలిలో కట్టిన ఈ భవనం నుంచి ధోనీ భద్రపరిచిన బైకులను చూడొచ్చు. రాంచీలోని తన ఇంటి ప్రాంగణంలోనే దీన్ని ధోని ఏర్పాటు చేసుకున్నాడని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇందులో పలు ఖరీదైన విదేశీ బైక్‌లు కూడా వున్నాయి. ఇందులో 37 బైకు బొమ్మలున్నాయని.. ఈ బొమ్మలతోనే తన భర్త ఆడుకుంటూ వున్నారని ధోనీ సతీమణి తెలిపింది. క్రికెట్‌కు దూరంగా వున్న తన భర్త బైకు బొమ్మలతో ఆడుకోవడం చూస్తుంటానని సాక్షి చెప్పింది. 
 
ఇకపోతే.. ధోనీ బైకులంటే తెగ ఇష్టపడతాడు. క్రికెట్ మ్యాచుల్లో భారత ఆటగాళ్లు ఎవరైనా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ కింద బైక్ గెలుచుకుంటే సదరు ఆటగాళ్ల కన్నా ముందే ధోని వాటిపై షికారు చేస్తాడు. ఖాళీ సమయాల్లో ధోనీ ఎక్కువగా బైకులతోనే చక్కర్లు కొడతాడనే విషయం తెలిసిందే.