గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 జూన్ 2024 (22:32 IST)

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై కేసు పెట్టిన మహిళ.. ఎందుకు?

minister anilkumar yadav
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఆరోపిస్తూ ఓ మహిళ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌ కాలనీలోని తన భూమిని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అక్రమంగా కబ్జా చేశారంటూ కౌసర్‌జాన్‌ అనే మహిళ నెల్లూరు చిన్నబజార్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన భూమిలో అనిల్‌కుమార్‌ యాదవ్‌ వైసీపీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారని ఆమె ఆరోపించారు. 
 
ఈ కేసులో తనకు న్యాయం చేయాలని ఏడాది కాలంగా దీక్ష చేస్తున్నానని కౌసర్‌జాన్‌ పేర్కొన్నారు. ఈ భూమిని తన భర్త 2002లోనే కొనుగోలు చేశాడని, వైసీపీ భవనాన్ని నిర్మించేందుకు అనిల్ అందులో 2.8 ఎకరాలను అక్రమంగా స్వాధీనం చేసుకున్నాడని ఆమె పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు.