1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 25 జూన్ 2024 (19:03 IST)

వాలంటీర్లను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ఆలోచిస్తున్నాం: మంత్రి పార్థసారధి

parthasarathy kolusu
వాలంటీర్లు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాలంటీర్లుతో తమకు నష్టం జరిగిందని వారిని నియమించిన వైసిపి నాయకులే సన్నాయినొక్కులు నొక్కారు. వీరిలో చాలామందిని అప్పట్లో రాజీనామా చేయించి పార్టీ కోసం పనిచేయాలని ఒత్తిడి తెచ్చారు. వాలంటీర్లు వైసిపి కోసం పనిచేసారో లేదో తెలియదు కానీ ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత వాలంటీర్ల వల్ల నాయకులకు ప్రజలకు మధ్య సంబంధాలు తెగిపోయాయనీ, అందువల్లనే పార్టీ ఓడిపోయిందని వైసిపికి చెందిన పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు.
 
వాలంటీర్లు చేయాల్సిన పనులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో చేయించేస్తుంది. పింఛన్ల పంపిణీ వారితో చేయిస్తుంది. మరి వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నను కొందరు మంత్రి పార్థసారధి దృష్టికి తీసుకుని వెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ... వాలంటీర్ల సేవలను ఏవిధంగా ఉపయోగించుకోవాలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని వెల్లడించారు. కాగా వాలంటీర్లకు సాక్షి పేపర్ కొనుగోలు చేసేందుకు ఇచ్చే అలవెన్సును ప్రభుత్వం రద్దు చేసింది.