శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:03 IST)

తమ్ముడు కుమార్తెను నరికి చంపి రక్తం తాగిన మహిళ... ఎక్కడ?

పుట్టింటి వేధింపులు భరించలేని ఓ వివాహిత అత్యంత కిరాతక చర్యకు పాల్పడింది. భర్త వదిలివేసిన మహిళ అనే జాలికూడా లేకుండా పుట్టింటి నుంచి వెళ్ళిపోవాలంటూ నిత్యం వేధిస్తూ వచ్చి మహిళ ఓ దారుణానికి పాల్పడింది. తనను మానసికంగా వేధించినందుకుగాను తన తమ్ముడు కుమార్తెను నరికి చంపి రక్తాన్నితాగింది. ఈ ఘటన విశాఖ జిల్లా మన్యం ఏరియాలో వెలుగులోకి వచ్చాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖపట్టణం జిల్లాలోని పెదబయలు మండలం, లకేయుపుట్టుకు చెందిన వంతాల రస్మో అనే మహిళకు కొన్నేళ్ళ క్రితం వివాహమైంది. అయితే, మనస్పర్ధల కారణంగా భర్త నుంచి దూరమై పుట్టింటిలోనే నివసిస్తోంది. అక్కడ తమ్ముడు భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యుల నుంచి ఆమె వేధింపులు ఎక్కువయ్యాయి. పుట్టింటిని వీడి అత్తారింటికి వెళ్లిపోవాలంటూ ప్రతి రోజూ గొడవ చేస్తూ వచ్చేవారు. దీంతో పలుమార్లు వారిమధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. 
 
తనను పుట్టింటికి వెళ్లిపోవాలంటూ వేధిస్తూ వచ్చిన తన సోదరుడు భార్యపై రస్మో కక్ష పెంచుకుంది. దీనికి ప్రతీకారంగా తీర్చుకోవాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం తన సోదరుడు కుమార్తె అయిన ఆరేళ్ళ బాలికని కత్తితో నరికి అతి దారుణంగా చంపింది. ఆ తర్వాత చిన్నారి రక్తాన్ని రస్మో తాగేసింది. ఈ ఘటనను గమనించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కిరాతక చర్యకు పాల్పడిన రస్మోను పోలీసులు అరెస్టు చేశారు.