బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 డిశెంబరు 2024 (17:31 IST)

Pawan Kalyan: పవన్ 100 పెళ్లిళ్లైనా చేసుకోవచ్చు.. శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు.. మహిళా ఫ్యాన్ (video)

Woman
Woman
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కున్న అభిమానులను గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. పీకే ఫ్యాన్స్ ఆయనపై ఈగ వాలనీయరు. ఈ అభిమానుల్లో వయోబేధం లేదు. చిన్నాపెద్ద తేడా లేకుండా భారీ స్థాయిలో ఆయనకు అభిమానులున్నారు. సినిమాల్లో ఆయన హీరో స్థాయి నుంచి రాజకీయ నేత వరకు ఆయనకు బ్రహ్మరథం పట్టే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
తాజాగా కల్యాణి అనే తెలంగాణ మహిళ పవన్ కల్యాణ్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఏపీకే ఆయన పరిమితం కాకూడదని.. తెలంగాణలో పవన్ పరిపాలన జరగాలని ఆకాంక్షించారు. తాజాగా ఆమె చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
తాను ముందు ఎన్టీఆర్ ఫ్యాన్ అని, ఎన్టీఆర్ అంటే తనకు పిచ్చి అభిమానం అన్నారు. అయితే పవన్ కల్యాణ్ సార్ వచ్చాక ఆయన పరిపాలన చూసి ఫిదా అయిపోయానని వెల్లడించారు ఆయన పడిన మాటలు, వారి అన్నదమ్ముల అనుబంధం చూసి ఆయన ఫ్యాన్‌ను అయిపోయానని చెప్పారు. 
 
ఏపీలో మంచి పరిపాలన చేస్తున్నారు. ఆయన ధర్మమూర్తి అని.. అక్కడ ఆయన డిప్యూటీ సీఎం.. ఎవరికైనా వచ్చిందా అలాంటి పదవి. ఇంకా ఆ పదవికి తగ్గట్టు మంచిపేరు ఆయనకు వచ్చింది. ఆ పేరు ఆయన మంచి పని చేసి సంపాదించుకున్నారు. ఇంతమంది రాజకీయ నేతలను చూశాను. 
 
ఇంతవరకు డిప్యూటీ సీఎం అంటే కూడా ఏంటో తెలియదు. ఆయన పేరు మారుమోగుతుంటే.. డిప్యూటీ సీఎం అంటే ఇట్టుంటడా అనిపించింది. ఇచ్చిన మాట ఇచ్చినట్లు నెరవేర్చుతుండు. వాళ్లెంత పుణ్యం చేసుకున్నారు. మనం అంటే తెలంగాణ వాళ్లం దరిద్రులమయ్యాం. ఆయన తెలంగాణకు రాలేదు. 
 
నెక్ట్స్ టైమ్ పవన్ కల్యాణ్ అన్న తెలంగాణకు రావాలి అన్నారు. తెలంగాణలో మాబోటి వాళ్లు మీకు ఓట్లేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణను కూడా పవన్ పరిపాలన జరగాలని ఆమె అన్నారు. ఏపీలోనే పవన్ వుండటానికి వీల్లేదు. 
 
ఇంకా ఆయన ముగ్గురు పెళ్లాల గురించి సదరు మహిళ మాట్లాడుతూ.. ఆయన ముగ్గురు పెళ్లాలేంటి.. ఆయన వందమంది కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఏం ఒక్కదాన్ని పెళ్లి చేసుకుని సరిగ్గా చూసుకోలేక వదిలిపెట్టే మగాళ్లున్న ఈ కాలంలో.. ఆయన దేవుడు. ఆయన శ్రీకృష్ణుడి స్థానంలో పుట్టాడు. ఆయన ఎంతమందినైనా చేసుకోవచ్చు. 
 
ఆయన బిడ్డల్ని చూడండి ఎంత బాగా చూసుకుంటున్నాడో.. ఎంత పద్ధతిగా వున్నారో. ఆయన ధర్మమూర్తి. ఆయన భక్తి, ఆయన పరిపాలన కావాలి. ఆయన్ని ఎవరైనా ఏదైనా మాటంటే వారే సర్వనాశమైపోతారు. 
 
పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసే వారికి బుద్ధి లేదు. చెప్పింది చెప్పేట్లు చేసే నాయకుడున్నాడా ఇప్పుడు అంటూ ప్రశ్నించింది. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకు ఆయన కుటుంబం కోసం వున్నాడు. ఇప్పుడు మనకోసం బయటికి వచ్చాడు. తెలంగాణకు కూడా ఆయన రావాలని కల్యాణి అనే మహిళాభిమాని ఆకాంక్షించారు.