మంథన్ సినిమా తీసిన విధానం తెలుసుకుని ఆశ్చర్యపోయా : పవన్ కళ్యాణ్ నివాళి
Shyam Benegal, Pawan Kalyan's tribute
వాస్తవిక పరిస్థితులకు అద్దంపట్టే కథలను వెండి తెరపై ఆవిష్కరించిన ప్రముఖ దర్శకులు శ్రీ శ్యామ్ బెనెగల్ గారు కన్ను మూశారని తెలిసి చింతిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నటుడు పవన్ కళ్యాణ్ సంతాప సందేశంలో పేర్కొన్నారు.
శ్యామ్ బెనెగల్ గారు తెరపై చూపించిన పాత్రలు సమాజంలోని పరిస్థితులకు ప్రతిబింబాలుగా ఉండేవి. అమూల్ పాల రైతులు రూ.2 చొప్పున ఇస్తే 1976లోనే క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సమకూర్చుకొని మంథన్ అనే సినిమాను ఆయన రూపొందించారని తెలిసినప్పుడు ఆశ్చర్యపోయాను. అంకుర్, నిశాంత్, భూమిక, మండి, మంథన్ లాంటి చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక శైలిని చూపించారు. శ్రీ శ్యామ్ బెనెగల్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అని తెలిపారు.